ఆంధ్రప్రదేశ్ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు (ఏపీఎంఏపీ) సీఈఓ, డిప్యూటీ కన్జర్వేటర్ ఆవుల చంద్రశేఖర్‌ను రాష్ట్ర అటవీశాఖ ఘనంగా సత్కరించింది. ఇటీవల లండన్‌లోని బ్రిటన్ పార్లమెంట్ హౌస్‌లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతర్జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా ఈ సన్మానం నిర్వహించారు. గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా నాగార్జున యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆన్‌లైన్ ద్వారా పాల్గొని చంద్రశేఖర్ సేవలను అభినందించారు. ఈ విజయానికి సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.

అంతర్జాతీయ అవార్డు గ్రహీత సీఈఓ ఆవుల చంద్రశేఖర్‌కు ఘన సత్కారం