తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” డోర్ టు డోర్ కార్యక్రమం తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండల కేంద్రంలో బుధవారం ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని, పారదర్శక పాలనతో ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఆయన పేర్కొన్నారు. విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి పలు రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.
అనంతరం స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు, సూచనలను నమోదు చేసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ విజయాలను వివరిస్తున్న కరపత్రాలను పంపిణీ చేసి, ప్రజల్లో ప్రభుత్వంపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.


