Wednesday, 22 July 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో ‘జగన్ 2.0’ యాప్ పోస్టర్ ఆవిష్కరణ
- తిరుపతి

శ్రీకాళహస్తిలో ‘జగన్ 2.0’ యాప్ పోస్టర్ ఆవిష్కరణ

శ్రీ కాళహస్తి, జులై 21, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిపట్టణంలోని స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ‘పార్టీకి ప్రజలే బలం – ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 యాప్’ పోస్టర్లను ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి, నియోజకవర్గ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. వైఎస్సార్‌సీపీపై జరుగుతున్న కుట్రలు, కార్యకర్తలపై దాడుల సమాచారాన్ని వేగంగా చేరవేయడంలో జగన్ 2.0 యాప్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.