శ్రీ కాళహస్తి, జులై 13, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలోని పలు మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ గదులకు ఈ నెల 16వ తేదీన మరు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మునిసిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్.ఓ.సి. నెం. 319/ఎ1/2020 ఉత్తర్వుల ప్రకారం.. వై.ఎస్.ఆర్. సర్కిల్ వద్ద ఉన్న పి.యం.ఆర్. షాపింగ్ కాంప్లెక్స్‌లోని షాపు రూములు 3, 34, 35, 38, బస్ స్టాండ్ రోడ్డులోని కొత్తపేట మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ షాపు నెం. 21, అలాగే సినిమా వీధిలోని పి.యం.ఆర్. షాపింగ్ కాంప్లెక్స్ షాపు రూములు 7, 41, 43, 45, 46 మరియు 47 గదులకు ఈ వేలం పాట జరగనుంది. ఆసక్తి గలవారు ఈ నెల 16-07-2026 గురువారం ఉదయం 11:00 గంటలకు పురపాలక సంఘ కార్యాలయంలో జరిగే బహిరంగ వేలంలో పాల్గొనవచ్చునని పేర్కొన్నారు. ఈ వేలం పాటను కమిషనర్ లేదా వారి అనుమతి పొందిన అధికారులు నిర్వహిస్తారని, వేలం పాటను ఖరారు చేయుటకు లేదా నిరాకరించుటకు కమిషనర్ మరియు కౌన్సిల్ వారికి పూర్తి అధికారాలు కలవని స్పష్టం చేశారు. వేలంలో పాల్గొనదలచిన వారు నిబంధనలకు లోబడి, ప్రతి అంగడి గదికి విడిగా రూ. 50,000/- ధరఖాస్తు (ధరావత్తు) సొమ్మును మునిసిపల్ కమిషనర్, శ్రీకాళహస్తి పురపాలక సంఘం పేరిట డి.డి. (D.D) రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని రూ. 5,00,000/- ల ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ సాల్వెన్సీ సర్టిఫికేట్‌ను జతపరచాలి. ఈ పత్రాలన్నింటినీ ఈ నెల 15-07-2026 బుధవారం సాయంత్రం 04:00 గంటల లోపు మునిసిపల్ కార్యాలయ రెవెన్యూ విభాగంలో సమర్పించి, రసీదు పొందిన వారు మాత్రమే బహిరంగ వేలంలో పాల్గొనడానికి అర్హులని కమిషనర్ ఆ ప్రకటనలో వివరించారు.

శ్రీకాళహస్తిలో మునిసిపల్ షాపుల పునః బహిరంగ వేలం-కమిషనర్ ప్రకటన