Tuesday, 14 July 2026
  • Home  
  • పైడిమెట్ట ఎత్తిపోతల పథకానికి ఊతం.. రాష్ట్ర నీటిపారుదల శాఖ బృందం క్షేత్రస్థాయి పరిశీలన
- తూర్పు గోదావరి

పైడిమెట్ట ఎత్తిపోతల పథకానికి ఊతం.. రాష్ట్ర నీటిపారుదల శాఖ బృందం క్షేత్రస్థాయి పరిశీలన

తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, జూలై 13: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో పైడిమెట్ట ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ల బృందం సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా ఎత్తిపోతల పథకం చైర్మన్ ముళ్లపూడి శ్రీరామచంద్రమూర్తి, గన్నిన సత్తిబాబు మాట్లాడుతూ పథకానికి అవసరమైన సాంకేతిక అంశాలు, నిధుల అవసరంపై సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, పైడిమెట్ట ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తాళ్లపూడి మండలంలోని సుమారు 5 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. దీనివల్ల రైతుల వ్యవసాయోత్పత్తి పెరిగి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయకట్టు రైతులు మాట్లాడుతూ పథకానికి అవసరమైన నిధులను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేసి, ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, జూలై 13:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో పైడిమెట్ట ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ల బృందం సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా ఎత్తిపోతల పథకం చైర్మన్ ముళ్లపూడి శ్రీరామచంద్రమూర్తి, గన్నిన సత్తిబాబు మాట్లాడుతూ పథకానికి అవసరమైన సాంకేతిక అంశాలు, నిధుల అవసరంపై సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, పైడిమెట్ట ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తాళ్లపూడి మండలంలోని సుమారు 5 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. దీనివల్ల రైతుల వ్యవసాయోత్పత్తి పెరిగి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు ఆయకట్టు రైతులు మాట్లాడుతూ పథకానికి అవసరమైన నిధులను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేసి, ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.