Saturday, 5 September 2026
  • Home  
  • మన రక్తంలో దాగి ఉన్న తీపి రహస్యం – ల్యాబ్ రిపోర్ట్ సాక్షిగా
- హెల్త్ టిప్స్

మన రక్తంలో దాగి ఉన్న తీపి రహస్యం – ల్యాబ్ రిపోర్ట్ సాక్షిగా

మన శరీరంలో దాదాపు ఐదు లీటర్ల రక్తం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అందులో ఉండే మొత్తం చక్కెర ఎంతో తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే! కేవలం ఐదు గ్రాములు మాత్రమే. అంటే సరిగ్గా మనం కాఫీలో వేసుకునే ఒక్క చిన్న చెంచా చక్కెర అన్నమాట! ​వినడానికి ఇది చాలా విచిత్రంగా ఉన్నా, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన అద్భుతమైన ఆరోగ్య సూత్రం ఇది. ల్యాబ్ రిపోర్ట్ లెక్క ఇదే: మన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్‌లో షుగర్ లేని వారికి నార్మల్ లెవెల్ 100 mg/dL (మిల్లీగ్రాములు/డెసిలీటర్లు) అని ఉంటుంది. అంటే 100 ml (మిల్లీలీటర్ల) రక్తంలో 100 mg (మిల్లీగ్రాముల) షుగర్ ఉంటుందని అర్థం. దీని ప్రకారం ఒక మిల్లీలీటర్ రక్తంలో ఒక మిల్లీగ్రాము షుగర్ ఉంటుంది. మరి మనిషి ఒంట్లో ఉండే 5000 ml రక్తంలో 5000 mg షుగర్ ఉంటుంది. 5000 mg అంటే సరిగ్గా 5 గ్రాములు. ఈ 5 గ్రాముల చక్కెరే మన ఇంట్లో వాడే ఒక్క స్పూన్ షుగర్! 1.​ఒక్క స్పూన్ ఉంటే (100 mg/dL): లైఫ్ సూపర్… మీరు నార్మల్! 2.​అర స్పూన్‌కి పడిపోతే (50 mg/dL): దాన్నే ‘హైపోగ్లైసీమియా’ (Hypoglycemia) అంటారు. అంటే షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం ఉంది. 😴 3.​రెండు స్పూన్లకి పెరిగితే (200 mg/dL ): దాన్నే ‘హైపర్ గ్లైసీమియా’ (Hyperglycemia) అంటారు. అంటే డయాబెటిస్ (మధుమేహం) వచ్చేసినట్టే! ​చూశారా! కేవలం అర చెంచా అటూ ఇటూ అయితేనే మన జీవితం తలకిందులైపోతుంది. మన శరీరంలో ఇంతటి ‘తీపి రాజకీయం’ నడుస్తోందని చాలా మందికి తెలియదు. ​అందుకే… ఈ ఒక్క స్పూన్ బ్యాలెన్స్‌ను క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన ఆహార నియమాలతో కాపాడుకుందాం! ఆరోగ్యంగా జీవిద్దాం!

మన శరీరంలో దాదాపు ఐదు లీటర్ల రక్తం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అందులో ఉండే మొత్తం చక్కెర ఎంతో తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే! కేవలం ఐదు గ్రాములు మాత్రమే. అంటే సరిగ్గా మనం కాఫీలో వేసుకునే ఒక్క చిన్న చెంచా చక్కెర అన్నమాట!

​వినడానికి ఇది చాలా విచిత్రంగా ఉన్నా, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన అద్భుతమైన ఆరోగ్య సూత్రం ఇది.

ల్యాబ్ రిపోర్ట్ లెక్క ఇదే:

మన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్‌లో షుగర్ లేని వారికి నార్మల్ లెవెల్ 100 mg/dL (మిల్లీగ్రాములు/డెసిలీటర్లు) అని ఉంటుంది. అంటే 100 ml (మిల్లీలీటర్ల) రక్తంలో 100 mg (మిల్లీగ్రాముల) షుగర్ ఉంటుందని అర్థం. దీని ప్రకారం ఒక మిల్లీలీటర్ రక్తంలో ఒక మిల్లీగ్రాము షుగర్ ఉంటుంది. మరి మనిషి ఒంట్లో ఉండే 5000 ml రక్తంలో 5000 mg షుగర్ ఉంటుంది. 5000 mg అంటే సరిగ్గా 5 గ్రాములు. ఈ 5 గ్రాముల చక్కెరే మన ఇంట్లో వాడే ఒక్క స్పూన్ షుగర్!

1.​ఒక్క స్పూన్ ఉంటే (100 mg/dL): లైఫ్ సూపర్… మీరు నార్మల్!

2.​అర స్పూన్‌కి పడిపోతే (50 mg/dL): దాన్నే ‘హైపోగ్లైసీమియా’ (Hypoglycemia) అంటారు. అంటే షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం ఉంది. 😴

3.​రెండు స్పూన్లకి పెరిగితే (200 mg/dL ): దాన్నే ‘హైపర్ గ్లైసీమియా’ (Hyperglycemia) అంటారు. అంటే డయాబెటిస్ (మధుమేహం) వచ్చేసినట్టే!

​చూశారా! కేవలం అర చెంచా అటూ ఇటూ అయితేనే మన జీవితం తలకిందులైపోతుంది. మన శరీరంలో ఇంతటి ‘తీపి రాజకీయం’ నడుస్తోందని చాలా మందికి తెలియదు.

​అందుకే… ఈ ఒక్క స్పూన్ బ్యాలెన్స్‌ను క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన ఆహార నియమాలతో కాపాడుకుందాం! ఆరోగ్యంగా జీవిద్దాం!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.