రక్తపోటు, మధుమేహం… సమకాలీన సమాజాన్ని వేధిస్తున్న అతిపెద్ద ప్రజారోగ్య సమస్యలు. వైద్య పరిభాషలో వీటిని ‘నిశ్శబ్ద హంతకులు’ అన్నా, సామాన్య భాషలో వీటిని “తోడు దొంగలు” అనవచ్చు. ఈ రెండు వ్యాధులూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. బీపీ ఉన్నవారికి షుగర్ వచ్చే అవకాశం, అలాగే షుగర్ ఉన్నవారికి బీపీ వచ్చే అవకాశం రెట్టింపు అవుతుంది.ఇవి మన శరీరంలో వేర్వేరుగా కనిపించినా, వీటి నివారణ మార్గాలు మాత్రం ఒకటే. రక్తపోటు ఉన్నవారు కేవలం ఉప్పు తగ్గించుకోవడమే కాదు, భవిష్యత్తులో మధుమేహం రాకుండా ఉండటానికి తీపిని కూడా తగ్గించుకోవాలి. అలాగే, మధుమేహం ఉన్నవారు చక్కెరను అదుపులో ఉంచుకోవడమే కాదు, బీపీ రాకుండా ఉండటానికి ఉప్పును కూడా కచ్చితంగా తగ్గించుకోవాలి.శారీరక శ్రమ లేకపోవడం, మితిమీరిన మానసిక ఒత్తిడి, కంటికి సరిపడా నిద్ర లేకపోవడం, ఉప్పు-తీపి ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి, శరీర బరువును అదుపులో ఉంచుకుంటూ, ఊబకాయం లేకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ తోడు దొంగలు ఇద్దరూ జతకడితే గుండెపోటు, పక్షవాతం, మరియు మూత్రపిండాల (కిడ్నీ) వైఫల్యం వంటి ప్రాణాంతక సమస్యల తీవ్రత పెరుగుతుంది.అందుకే, నిరంతర వైద్య పరీక్షలు, క్రమం తప్పని వ్యాయామం, ధూమపానానికి మరియు మద్యపానానికి దూరంగా ఉండటం, కంటికి సరిపడా నిద్రపోవడం, ఉప్పు-తీపి నియంత్రించిన సమతుల్య ఆహారం ద్వారా ఈ తోడు దొంగలను అదుపులో ఉంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగించవచ్చు.

బీపీ, షుగర్‌లు తోడు దొంగలు : డా. ఎం.వి.ఆర్