కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులు పెరుగుతుండటంపై మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అక్రమ మద్యం కారణంగా కుటుంబ కలహాలు, గృహహింస, ఆర్థిక సమస్యలు పెరిగి మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బెల్ట్ షాపుల నిర్మూలన కోసం గతంలో పలు నిరసనలు చేపట్టినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని పేర్కొంటున్నారు.
అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్, పోలీసు శాఖలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కొమురం భీం జిల్లాలో బెల్ట్ షాపుల బీభత్సం.. మహిళల ఆవేదనకు స్పందించేదెవరు?”
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులు పెరుగుతుండటంపై మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అక్రమ మద్యం కారణంగా కుటుంబ కలహాలు, గృహహింస, ఆర్థిక సమస్యలు పెరిగి మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బెల్ట్ షాపుల నిర్మూలన కోసం గతంలో పలు నిరసనలు చేపట్టినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని పేర్కొంటున్నారు. అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్, పోలీసు శాఖలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

