Tuesday, 14 July 2026
  • Home  
  • *సువెన్ ఆగ్రో కంపెనీ ఆధ్వర్యంలోపామాయిల్ సాగు పై రైతులకు శిక్షణ కార్యక్రమం*, నందలూరు (పున్నమి విలేకరి)జులై 14.
- కడప

*సువెన్ ఆగ్రో కంపెనీ ఆధ్వర్యంలోపామాయిల్ సాగు పై రైతులకు శిక్షణ కార్యక్రమం*, నందలూరు (పున్నమి విలేకరి)జులై 14.

నందలూరు మండలంలో ఆడపూరు గ్రామంలో పామాయిల్ సాగు పై రైతులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగాఉద్యాన అధికారి సునీల్ మాట్లాడుతూ, ఎకరాకు 50 మొక్కలు నాటుకోవాలని, మొక్కలు మొత్తం ప్రభుత్వం వారు నియమించిన సువెన్ కంపెనీ ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. ఒక రైతుకు 25(ఇరవైఐదు)ఎకరాలు వరకు సాగు చేసుకోవచ్చని తెలిపారు. 25ఎకరాలకు మొక్కలు ఉచితంగానే పంపిణీ చేస్తామని తెలిపారు. ఒక హెక్టార్ కు (రెండు నర్ర ఎకరాలు) మొక్కలకు 29000 ఖర్చు అవుతుందని, మొత్తం ఖర్చు ప్రభుత్వం భరించి మొక్కలు సువెన్ కంపెనీ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం హెక్టార్ కు 10500 మొక్కల నిర్వహణకు మెయింటెనెన్స్ ఖర్చులకు 4 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుందని, సువెన్ ఆగ్రో ప్రతినిధి కొండారెడ్డి మాట్లాడుతూ రెండు ఇంచుల నీరు ఉన్న ప్రతి రైతు 5 ఎకరాలలో ఎటువంటి అభ్యంతరం లేకుండా సాగు చేసుకోవచ్చని తెలిపారు. మామిడి రైతులు ప్రత్యామ్నాయ పంటగా దీనిని ఎంచుకోవచ్చు అని తెలిపారు. కంపెనీ మొక్కలు ఉచితంగా ఇవ్వడమే కాక సాగు పద్ధతులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించి సస్యరక్షణ చర్యల గురించి వివరిస్తూ రైతుకు చేదోడు వాదోడుగా ఉంటామని తెలియజేశారు. నాటిన ఐదు సంవత్సరాలకి 6 నుంచి 7 టన్నులు, ఆ పైన ప్రతి సంవత్సరం కొంత దిగుబడి పెరుగుతూ ఎకరాకు పది నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుందనితెలియజేశారు. ప్రస్తుతము ఒక టన్ను 24 వేల రూపాయలు పలుకుతోందని, తెలిపారు . ఇతర పంటలు మాదిరి కాకుండా ఈ పంటకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలను కంపెనీలు చెల్లిస్తాయని కనుక రైతు నష్టపోయే అవకాశాలు తక్కువ అని తెలియజేశారు. ఈ పంటకు చీడ పీడల ల సమస్య కూడా తక్కువగా ఉంటుందని తెలియజేశారు. ఆసక్తి గల రైతులు తమ దగ్గరలోనే రైతు సేవా కేంద్రాలలో పూర్తి సమాచారము పొందవచ్చని ఉద్యాన అధికారి సునీల్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్ర సిబ్బంది విజయ కుమారి, రైతులు పాల్గొన్నారు.

నందలూరు మండలంలో ఆడపూరు గ్రామంలో పామాయిల్ సాగు పై రైతులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగాఉద్యాన అధికారి సునీల్ మాట్లాడుతూ, ఎకరాకు 50 మొక్కలు నాటుకోవాలని, మొక్కలు మొత్తం ప్రభుత్వం వారు నియమించిన సువెన్ కంపెనీ ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు.
ఒక రైతుకు 25(ఇరవైఐదు)ఎకరాలు వరకు సాగు చేసుకోవచ్చని తెలిపారు. 25ఎకరాలకు మొక్కలు ఉచితంగానే పంపిణీ చేస్తామని తెలిపారు.
ఒక హెక్టార్ కు (రెండు నర్ర ఎకరాలు) మొక్కలకు 29000 ఖర్చు అవుతుందని, మొత్తం ఖర్చు ప్రభుత్వం భరించి మొక్కలు సువెన్ కంపెనీ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం హెక్టార్ కు 10500 మొక్కల నిర్వహణకు మెయింటెనెన్స్ ఖర్చులకు 4 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుందని,
సువెన్ ఆగ్రో ప్రతినిధి కొండారెడ్డి మాట్లాడుతూ రెండు ఇంచుల నీరు ఉన్న ప్రతి రైతు 5 ఎకరాలలో ఎటువంటి అభ్యంతరం లేకుండా సాగు చేసుకోవచ్చని తెలిపారు.
మామిడి రైతులు ప్రత్యామ్నాయ పంటగా దీనిని ఎంచుకోవచ్చు అని తెలిపారు.
కంపెనీ మొక్కలు ఉచితంగా ఇవ్వడమే కాక సాగు పద్ధతులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించి సస్యరక్షణ చర్యల గురించి వివరిస్తూ రైతుకు చేదోడు వాదోడుగా ఉంటామని తెలియజేశారు.
నాటిన ఐదు సంవత్సరాలకి 6 నుంచి 7 టన్నులు, ఆ పైన ప్రతి సంవత్సరం కొంత దిగుబడి పెరుగుతూ ఎకరాకు పది నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుందనితెలియజేశారు.
ప్రస్తుతము ఒక టన్ను 24 వేల రూపాయలు పలుకుతోందని, తెలిపారు .
ఇతర పంటలు మాదిరి కాకుండా ఈ పంటకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలను కంపెనీలు చెల్లిస్తాయని కనుక రైతు నష్టపోయే అవకాశాలు తక్కువ అని తెలియజేశారు.
ఈ పంటకు చీడ పీడల ల సమస్య కూడా తక్కువగా ఉంటుందని తెలియజేశారు.
ఆసక్తి గల రైతులు తమ దగ్గరలోనే రైతు సేవా కేంద్రాలలో పూర్తి సమాచారము పొందవచ్చని ఉద్యాన అధికారి సునీల్ తెలియజేశారు
ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్ర సిబ్బంది విజయ కుమారి, రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.