ఆత్మకూరు జ్యోతిరావు పూలే బాలికల గురుకులంలో డెంగ్యూ నివారణ అవగాహన సదస్సు. విద్యార్థినులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేసిన డాక్టర్ సాయి ప్రసన్న.
ఆత్మకూరు: యూపీహెచ్‌సీ అరుంధతివాడ,ఆత్మకూరు నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం – డెంగ్యూ నివారణ మాసోత్సవం సందర్భంగా ప్రత్యేక అవగాహన యూపీహెచ్‌సీ అరుంధతివాడ, ఆత్మకూరు ఆధ్వర్యంలో స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు ప్రత్యేక వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమం మరియు ఉచిత మందుల పంపిణీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డా. ఎం. సాయి ప్రసన్న హాజరై విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.డెంగ్యూ నివారణ మాసోత్సవం సందర్భంగా విద్యార్థినులకు డెంగ్యూ వ్యాధిపై సమగ్ర అవగాహన కల్పించారు. దోమలు పెరగకుండా ఇంటి, పాఠశాల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడడం, నీటి నిల్వ పాత్రలను మూతపెట్టడం, వారానికి ఒకరోజు డ్రై డే పాటించడం, పూర్తి చేతుల దుస్తులు ధరించడం, జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించడం వంటి ముఖ్యమైన జాగ్రత్తలను వివరించారు.అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సమతుల ఆహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని సూచించారు.ఈ సందర్భంగా డా. ఎం. సాయి ప్రసన్న గారు పాఠశాలలోని వంటశాల (కిచెన్), ఆహార నిల్వ గది (స్టోర్ రూమ్), డైనింగ్ హాల్లను పరిశీలించారు. ఆహార పదార్థాలను పరిశుభ్రంగా నిల్వ చేయడం, వంటశాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచడం, విద్యార్థినులకు సురక్షితమైన, పోషకాహారం అందించడం, తాగునీటి పరిశుభ్రతను కాపాడడం, వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం వంటి అంశాలపై సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి రమ్యశ్రీ, హెచ్.ఈ.ఓ. శ్రీ ఎస్. సుధాకర్, హెల్త్ అసిస్టెంట్ జి. రవీంద్ర రెడ్డి, ఏఎన్‌ఎం శ్రీమతి సుభానీ బేగం, ఆశా కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


