మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి, తన భార్య దానమ్మతో కలిసి తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ ఎదుట లొంగిపోయారు.
ఈ విషయాన్ని డీజీపీ మీడియాకు వెల్లడించారు. హనుమకొండ జిల్లా సోమిడి గ్రామానికి చెందిన నరహరి, డిగ్రీ చదివే రోజుల్లోనే 1982లో అజ్ఞాతంలోకి వెళ్లారు.
2017లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన ఆయన.. ఆయుధాలు, రాకెట్లు, గ్రెనేడ్ల తయారీలో నిపుణుడు. అలాగే కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేవారు. ఈ లొంగుబాటు మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బని, ప్రస్తుతం తెలంగాణకు చెందిన ముగ్గురు నేతలు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని డీజీపీ తెలిపారు.

తెలంగాణ డీజీపీ ఎదుట టాప్ మావోయిస్టు లొంగుబాటు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి, తన భార్య దానమ్మతో కలిసి తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని డీజీపీ మీడియాకు వెల్లడించారు. హనుమకొండ జిల్లా సోమిడి గ్రామానికి చెందిన నరహరి, డిగ్రీ చదివే రోజుల్లోనే 1982లో అజ్ఞాతంలోకి వెళ్లారు. 2017లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన ఆయన.. ఆయుధాలు, రాకెట్లు, గ్రెనేడ్ల తయారీలో నిపుణుడు. అలాగే కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేవారు. ఈ లొంగుబాటు మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బని, ప్రస్తుతం తెలంగాణకు చెందిన ముగ్గురు నేతలు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని డీజీపీ తెలిపారు.

