Thursday, 2 July 2026
  • Home  
  • చంద్రశేఖర్ అరెస్టు అన్యాయం.. వెంటనే విడుదల చేయాలి: రేకులకుంట వెంకటేష్
- అన్నమయ్య

చంద్రశేఖర్ అరెస్టు అన్యాయం.. వెంటనే విడుదల చేయాలి: రేకులకుంట వెంకటేష్

సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సి.హెచ్. చంద్రశేఖర్‌ను అరెస్టు చేయడం అన్యాయమని, వెంటనే విడుదల చేయాలని ఏపీఎండీసీ పోరాట యూనియన్ జనరల్ సెక్రటరీ రేకులకుంట వెంకటేష్ డిమాండ్ చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగంపేట పర్యటన నేపథ్యంలో చంద్రశేఖర్‌ను పోలీసులు ఆయన నివాసంలోనే అరెస్టు చేయడాన్ని ఏపీఎండీసీ పోరాట యూనియన్ తీవ్రంగా ఖండించింది. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో కార్మిక నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వెంకటేష్ పేర్కొన్నారు. ఏపీఎండీసీ కోసం భూములు, ఇండ్లు త్యాగం చేసిన మంగంపేట కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని, మంగంపేట బెరైటీస్‌ను పరిరక్షించాలని, సంస్థకు నష్టం కలిగించే బల్క్ టెండర్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండేళ్లుగా కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడం, మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు, గ్రాట్యూటీ, డెత్ ఇన్సూరెన్స్, పండుగ కానుకలు అందించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఏపీఎండీసీ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోరాట యూనియన్ నాయకులు ఎస్.వి.వి. రాజా వర్మ, డబ్బు శివప్రసాద్, ఎం. బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సి.హెచ్. చంద్రశేఖర్‌ను అరెస్టు చేయడం అన్యాయమని, వెంటనే విడుదల చేయాలని ఏపీఎండీసీ పోరాట యూనియన్ జనరల్ సెక్రటరీ రేకులకుంట వెంకటేష్ డిమాండ్ చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగంపేట పర్యటన నేపథ్యంలో చంద్రశేఖర్‌ను పోలీసులు ఆయన నివాసంలోనే అరెస్టు చేయడాన్ని ఏపీఎండీసీ పోరాట యూనియన్ తీవ్రంగా ఖండించింది. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో కార్మిక నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వెంకటేష్ పేర్కొన్నారు.
ఏపీఎండీసీ కోసం భూములు, ఇండ్లు త్యాగం చేసిన మంగంపేట కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని, మంగంపేట బెరైటీస్‌ను పరిరక్షించాలని, సంస్థకు నష్టం కలిగించే బల్క్ టెండర్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండేళ్లుగా కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడం, మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు, గ్రాట్యూటీ, డెత్ ఇన్సూరెన్స్, పండుగ కానుకలు అందించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఏపీఎండీసీ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పోరాట యూనియన్ నాయకులు ఎస్.వి.వి. రాజా వర్మ, డబ్బు శివప్రసాద్, ఎం. బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.