శ్రీ కాళహస్తి, జూన్ 21, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని పొన్నాలమ్మ దేవాలయం (పెట్రోల్ బంక్ దగ్గర) వద్ద ఆదివారం సాయంత్రం వన్నికులక్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ప్రతిభావంతుడైన విద్యార్థి హర్షవర్ధన్‌కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఇటీవల విడుదలైన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ (MPC) ఫలితాలలో హర్షవర్ధన్ 470 మార్కులకు గాను ఏకంగా 467 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకును, శ్రీకాళహస్తి పట్టణంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ అద్భుత విజయం ద్వారా తన సామాజిక వర్గానికి ఎంతో గర్వకారణంగా నిలిచినందుకు ఈ సత్కారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం విద్యార్థి హర్షవర్ధన్‌ను శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో విద్యే అత్యంత కీలకమైనదని వివరించారు. మనిషి గౌరవప్రదంగా మనుగడ సాగించడానికి, జీవితంలో ఉన్నతంగా స్థిరపడటానికి విద్యే ప్రధాన ఆయుధమని ఉద్ఘాటించారు. ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారానే వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. హర్షవర్ధన్ సాధించిన ఈ గొప్ప విజయం ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ రెడ్డివారి గురవారెడ్డి, వన్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లు శ్రీమతి తేజోవతి, శ్రీ బాలసుబ్రహ్మణ్యం అయ్యంగారు, శ్రీ మిన్నల్ రవి, శ్రీ మునిరత్నం రెడ్డి, అలాగే సీనియర్ నాయకులు శ్రీ సత్రవాడ ప్రవీణ్, శ్రీ పేట బాలాజీ తదితర కమ్యూనిటీ నాయకులు పాల్గొన్నారు. వీరితో పాటు సామాజిక వర్గ బంధువులు, శ్రేయోభిలాషులు మరియు యువతీయువకులు పెద్ద సంఖ్యలో విచ్చేసి బాబును మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

ఇంటర్లో స్టేట్ సెకండ్ ర్యాంకర్ హర్షవర్ధన్‌కు ఘన సన్మానం