Sunday, 28 June 2026
  • Home  
  • ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఎన్డీఏ సమీక్ష
- తిరుపతి

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఎన్డీఏ సమీక్ష

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రుల పర్యటనతో పాటు వి.బి.జి రాంజీ గ్రామీణ పథకం ప్రారంభోత్సవ సభను విజయవంతంగా నిర్వహించేందుకు రైల్వే కోడూరు నియోజకవర్గంలో రాజకీయ, పరిపాలనా ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ఎన్డీఏ నాయకులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సభా నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ, వేదిక ఏర్పాట్లు, నాయకులకు బాధ్యతల కేటాయింపు, ప్రజల భాగస్వామ్యం, రవాణా, సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం. సభను విజయవంతం చేయడంలో ప్రతి నాయకుడు సమన్వయంతో పనిచేయాలని సూచించనున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎన్డీఏ నాయకులు నిర్ణీత సమయానికి సమావేశానికి, అనంతరం సభా ఏర్పాట్లలో చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రుల పర్యటనతో పాటు వి.బి.జి రాంజీ గ్రామీణ పథకం ప్రారంభోత్సవ సభను విజయవంతంగా నిర్వహించేందుకు రైల్వే కోడూరు నియోజకవర్గంలో రాజకీయ, పరిపాలనా ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ఎన్డీఏ నాయకులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

సభా నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ, వేదిక ఏర్పాట్లు, నాయకులకు బాధ్యతల కేటాయింపు, ప్రజల భాగస్వామ్యం, రవాణా, సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం. సభను విజయవంతం చేయడంలో ప్రతి నాయకుడు సమన్వయంతో పనిచేయాలని సూచించనున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎన్డీఏ నాయకులు నిర్ణీత సమయానికి సమావేశానికి, అనంతరం సభా ఏర్పాట్లలో చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.