Sunday, 7 June 2026
  • Home  
  • మంచినీరు వృథాగా పారుతున్న … నిద్ర మత్తులో అధికారులు..!
- E-పేపర్

మంచినీరు వృథాగా పారుతున్న … నిద్ర మత్తులో అధికారులు..!

మంచినీరు వృథాగా పారుతున్న … నిద్ర మత్తులో అధికారులు..! పున్నమి న్యూస్ 07 జూన్ 2026 తెలంగాణ ఇంచార్జి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీ పరిధిలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. గ్రామంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ప్రధాన మంచినీటి పైప్ లైన్ పగిలిపోవడంతో గత మూడు నాలుగు గంటలుగా వేల లీటర్ల తాగునీరు వృథాగా పారిపోతున్నా సంబంధిత అధికారులు మాత్రం స్పందించకపోవడం గ్రామ ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. గ్రామంలో ఇప్పటికే మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, ఇలా విలువైన తాగునీరు రోడ్లపై పారిపోవడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వేసవి తీవ్రత పెరిగి ప్రజలు నీటి కోసం అలమటిస్తుంటే, మరోవైపు అధికారులు మాత్రం సమస్యను పట్టించుకోకుండా నిద్ర మత్తులో ఉన్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. వాటర్ పైప్ పగిలిన ప్రాంతంలో నీరు భారీగా లీక్ అవుతూ రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు జారిపడే ప్రమాదం కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇలా నిరంతరం నీరు పారిపోవడం వల్ల గ్రామానికి సరఫరా కావాల్సిన తాగునీరు కూడా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలు పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు ఎవరూ సంఘటన స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం. ప్రజల సమస్యలపై స్పందించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే పైప్ లైన్ మరమ్మతులు చేపట్టి వృథాగా పారిపోతున్న మంచినీటిని నిలిపివేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్రామాలకు మంచినీటి సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ నీరు ఇలా వృథా కావడం దురదృష్టకరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు మేల్కొని తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

మంచినీరు వృథాగా పారుతున్న … నిద్ర మత్తులో అధికారులు..!

పున్నమి న్యూస్
07 జూన్ 2026
తెలంగాణ ఇంచార్జి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీ పరిధిలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. గ్రామంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ప్రధాన మంచినీటి పైప్ లైన్ పగిలిపోవడంతో గత మూడు నాలుగు గంటలుగా వేల లీటర్ల తాగునీరు వృథాగా పారిపోతున్నా సంబంధిత అధికారులు మాత్రం స్పందించకపోవడం గ్రామ ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
గ్రామంలో ఇప్పటికే మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, ఇలా విలువైన తాగునీరు రోడ్లపై పారిపోవడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వేసవి తీవ్రత పెరిగి ప్రజలు నీటి కోసం అలమటిస్తుంటే, మరోవైపు అధికారులు మాత్రం సమస్యను పట్టించుకోకుండా నిద్ర మత్తులో ఉన్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు.
వాటర్ పైప్ పగిలిన ప్రాంతంలో నీరు భారీగా లీక్ అవుతూ రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు జారిపడే ప్రమాదం కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇలా నిరంతరం నీరు పారిపోవడం వల్ల గ్రామానికి సరఫరా కావాల్సిన తాగునీరు కూడా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ ప్రజలు పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు ఎవరూ సంఘటన స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం. ప్రజల సమస్యలపై స్పందించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే పైప్ లైన్ మరమ్మతులు చేపట్టి వృథాగా పారిపోతున్న మంచినీటిని నిలిపివేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్రామాలకు మంచినీటి సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ నీరు ఇలా వృథా కావడం దురదృష్టకరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు మేల్కొని తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.