Thursday, 23 July 2026
  • Home  
  • కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 24న విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో గురువారం కడప నగరంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి, బంద్ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది.
- News

కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 24న విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో గురువారం కడప నగరంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి, బంద్ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అరుణ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్, PSU రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు,AISB రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్రప్రసాద్, AISA జిల్లా కన్వీనర్ అనిల్, NSUI జిల్లా అధ్యక్షులు బాబు మాట్లాడుతూ… లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తును అంధకారంలోకి కేంద్ర ప్రభుత్వం అంధకారంలోకి నెట్టి ప్రశ్నించే వారిపైనా నిరంకుశ పద్ధతిలో నిర్బంధాన్ని విధిస్తుందని అన్నారు. ఛలో పార్లమెంట్ కార్యక్రమంలో విద్యార్థులు, బాష్ప వాయువులు ప్రయోగించి తీవ్ర గాయాలపాలయ్యేల డిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేసిన తప్పుకు జవాబుదారీగా ఉండాలని ప్రశ్నిస్తే క్రూరంగా వ్యవహరించడం హేయమైన చర్య అన్నారు. పోలీసుల దాడిలో ప్రస్తుతం ఒక విద్యార్థిని చావుబతుకుల మధ్య ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. మరొక్కనిమిషం కూడా విద్యా శాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ఉండకూడదని హెచ్చరించారు. 24 న విద్యాసంస్థల బంద్ అందరూ కలిసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే దేశంలో జరుగుతున్న పరిణామాలపై కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదని వాపోయారు. నీట్ పరీక్షా లీకేజ్ కారణంగా రాష్ట్రంలో 50 వేల మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారని తెలిపారు. రాష్ట్ర అధికార, ప్రతిపక్ష నేతలు నిరుమేదపాలని డిమాండ్ చేశారు. గత 12 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 152 పరీక్షా పేపర్లు లీకేజ్ గురయ్యాయని, ఇది కోట్లలో వ్యాపారం అని అన్నారు.మరియు వేలాది మంది విద్యార్థులు శాంతి యూతంగా ర్యాలీ చేపడితే పోలీసులను మొహరించి, ఇంటర్ నెట్ ఆపేయడం, మెట్రోలను ఆపేయడం చుస్తే బీజేపీ ప్రభుత్వం యువత పోరాటానికి భయానికి లోనవుతుందనేది స్పష్టంగా అర్థమవుతుందని తక్షణమే ఇప్పటికైనా స్పందించి, దర్మేంద్రప్రధాన్ ను బర్త్ రఫ్ చేయాలనీ డిమాండ్ చేశారు. రేపు జరగబోవు విద్యాసంస్థల బందుకు జిల్లా మరియు రాష్ట్రంలోని విద్యాసంస్థల అధినేతలు ,విద్యార్థులు, మేధావులు తల్లిదండ్రులు బంద్ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాల సుమంత్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని,AIYL జిల్లా కార్యదర్శి చిరంజీవి,ఎస్ఎఫ్ఐ నగర, అధ్యక్ష కార్యదర్శులు నవీన్, అఖిలేష్, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి విజయ్,PSU జిల్లా అధ్యక్షులు గోపి, ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి రాజేష్, నగర నాయకులు మల్లికార్జున రెడ్డి, అభిరామ్, నిఖిల్, ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు కార్తీక్, నాని తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క బందుకి రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి మద్దతు తెలపడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అరుణ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్, PSU రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు,AISB రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్రప్రసాద్, AISA జిల్లా కన్వీనర్ అనిల్, NSUI జిల్లా అధ్యక్షులు బాబు మాట్లాడుతూ…
లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తును అంధకారంలోకి కేంద్ర ప్రభుత్వం అంధకారంలోకి నెట్టి ప్రశ్నించే వారిపైనా నిరంకుశ పద్ధతిలో నిర్బంధాన్ని విధిస్తుందని అన్నారు. ఛలో పార్లమెంట్ కార్యక్రమంలో విద్యార్థులు, బాష్ప వాయువులు ప్రయోగించి తీవ్ర గాయాలపాలయ్యేల డిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేసిన తప్పుకు జవాబుదారీగా ఉండాలని ప్రశ్నిస్తే క్రూరంగా వ్యవహరించడం హేయమైన చర్య అన్నారు. పోలీసుల దాడిలో ప్రస్తుతం ఒక విద్యార్థిని చావుబతుకుల మధ్య ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. మరొక్కనిమిషం కూడా విద్యా శాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ఉండకూడదని హెచ్చరించారు. 24 న విద్యాసంస్థల బంద్ అందరూ కలిసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే దేశంలో జరుగుతున్న పరిణామాలపై కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదని వాపోయారు. నీట్ పరీక్షా లీకేజ్ కారణంగా రాష్ట్రంలో 50 వేల మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారని తెలిపారు. రాష్ట్ర అధికార, ప్రతిపక్ష నేతలు నిరుమేదపాలని డిమాండ్ చేశారు.
గత 12 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 152 పరీక్షా పేపర్లు లీకేజ్ గురయ్యాయని, ఇది కోట్లలో వ్యాపారం అని అన్నారు.మరియు
వేలాది మంది విద్యార్థులు శాంతి యూతంగా ర్యాలీ చేపడితే పోలీసులను మొహరించి, ఇంటర్ నెట్ ఆపేయడం, మెట్రోలను ఆపేయడం చుస్తే బీజేపీ ప్రభుత్వం యువత పోరాటానికి భయానికి లోనవుతుందనేది స్పష్టంగా అర్థమవుతుందని తక్షణమే ఇప్పటికైనా స్పందించి, దర్మేంద్రప్రధాన్ ను బర్త్ రఫ్ చేయాలనీ డిమాండ్ చేశారు.
రేపు జరగబోవు విద్యాసంస్థల బందుకు జిల్లా మరియు రాష్ట్రంలోని విద్యాసంస్థల అధినేతలు ,విద్యార్థులు, మేధావులు తల్లిదండ్రులు బంద్ జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాల సుమంత్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని,AIYL జిల్లా కార్యదర్శి చిరంజీవి,ఎస్ఎఫ్ఐ నగర, అధ్యక్ష కార్యదర్శులు నవీన్, అఖిలేష్, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి విజయ్,PSU జిల్లా అధ్యక్షులు గోపి, ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి రాజేష్, నగర నాయకులు మల్లికార్జున రెడ్డి, అభిరామ్, నిఖిల్, ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు కార్తీక్, నాని తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క బందుకి రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి మద్దతు తెలపడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.