పాలవాగు వద్ద గుర్తుతెలియని మృతదేహం.. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్
వింజమూరు మండలంలోని వింజేటమ్మకొండ మార్గంలో పాలవాగు సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పోలీసు అధికారులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. ఘటనాస్థలంలో లభించిన ఆధార్ కార్డు, బైక్ నంబర్ ఆధారంగా మృతుడు కలిగిరి మండలం వీర్నకల్లు గ్రామానికి చెందిన ఎలక్ట్రిషియన్ శ్రీకాంత్‌గా గుర్తించారు. శనివారం ఇంటి నుంచి వెళ్లిన శ్రీకాంత్ తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పశువుల కాపరులు మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

పాలవాగు వద్ద గుర్తుతెలియని మృతదేహం.. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్
పాలవాగు వద్ద గుర్తుతెలియని మృతదేహం.. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు మండలంలోని వింజేటమ్మకొండ మార్గంలో పాలవాగు సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పోలీసు అధికారులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. ఘటనాస్థలంలో లభించిన ఆధార్ కార్డు, బైక్ నంబర్ ఆధారంగా మృతుడు కలిగిరి మండలం వీర్నకల్లు గ్రామానికి చెందిన ఎలక్ట్రిషియన్ శ్రీకాంత్‌గా గుర్తించారు. శనివారం ఇంటి నుంచి వెళ్లిన శ్రీకాంత్ తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పశువుల కాపరులు మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

