ఓబీసీ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు డెహ్రాడూన్ చేరుకున్న రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారికి ఘన స్వాగతం
రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారు ఓబీసీ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత కమిటీ అధికారులు మరియు స్థానిక ప్రతినిధులు సంప్రదాయ సాంస్కృతిక పద్ధతిలో ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఉత్తరాఖండ్ సాంప్రదాయ కళారూపాలు, వాయిద్యాలతో కూడిన ఆత్మీయ స్వాగత కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కమిటీ సభ్యులు మరియు అధికారులు శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు.
ఈ సమావేశంలో ఓబీసీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమ పథకాల అమలు, సామాజిక న్యాయం వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం ఉపయోగకరంగా నిలుస్తుందని శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారు పేర్కొన్నారు.
–


