కురమిద్దలో ఉద్రిక్తత.. అసైన్మెంట్ భూమిలో పనులను అడ్డుకున్న గ్రామస్థులు
పున్నమి న్యూస్ ప్రతినిధి
09 మే 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
కురమిద్ద గ్రామ పరిధిలో పంతం సత్తెమ్మ అసైన్మెంట్ భూమిలో అక్రమంగా పనులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గ్రామస్థులు, స్థానిక నాయకులు ఆందోళన చేపట్టారు. అక్కడ పని చేస్తున్న ఎల్ & టీ (ల్ &టీ ) సిబ్బందిని మరియు వారికి సహకరిస్తున్న పోలీసులను గ్రామస్థులు అడ్డుకున్నారు.
చట్ట వ్యతిరేకంగా పనులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, వెంటనే పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ ఉన్న వారిని గ్రామస్థులు వెనక్కి పంపించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా కవుల సరస్వతి మాట్లాడుతూ, అసైన్మెంట్ భూముల్లో అక్రమ పనులు సహించబోమని హెచ్చరించారు. గ్రామ ప్రజల హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.



