Wednesday, 6 May 2026
  • Home  
  • మునిరత్నం వర్ధంతి సందర్భంగా సేవల జల్లు – మహిళలకు శిక్షణ, ఉచిత వైద్య శిబిరం
- తిరుపతి

మునిరత్నం వర్ధంతి సందర్భంగా సేవల జల్లు – మహిళలకు శిక్షణ, ఉచిత వైద్య శిబిరం

శ్రీకాళహస్తి, మే 06 (పున్నమి న్యూస్): రాష్ట్రీయ సేవా సమితి (రాస్) వ్యవస్థాపక కార్యదర్శి, పద్మశ్రీ డాక్టర్ గుత్తా మునిరత్నం 5వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాస్ అధ్యక్షులు డాక్టర్ వెంకటరత్నం, డైరెక్టర్ నాగరాజు మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమాలు మానవతా సేవకు నిదర్శనంగా నిలిచాయి. ఈ సందర్భంగా జన్ శిక్షన్ సంస్థాన్ (JSS) ఆధ్వర్యంలో మూడు నెలలపాటు నిర్వహించిన ఉచిత టైలరింగ్ శిక్షణను పూర్తి చేసిన 60 మంది మహిళలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ రంగయ్య నాయుడు మాట్లాడుతూ.. మునిరత్నం మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. శిక్షణ పొందిన మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా తిరుపతి హరే కృష్ణ వైద్యాలయం సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 220 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 60 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేసి, వారిని ప్రత్యేక వాహనాల్లో తిరుపతికి తరలించారు. వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారికి కుట్టు యంత్రాలు, వికలాంగులకు వీల్ చైర్లు, వృద్ధులకు చేతికర్రలు, దుప్పట్లు పంపిణీ చేశారు. రాస్ అధికారి కరుణాకర్ నాయుడు, సంస్థ సిబ్బంది, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మునిరత్నం సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడంపై పాల్గొన్నవారు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.