నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో “విద్య… వసతి… వికాసం” కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 155 ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు, ఫర్నిచర్, వాషింగ్ మెషీన్లు, ఆధునిక విద్యుత్ సదుపాయాలు, నాణ్యమైన వంటశాల పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, నియోజకవర్గ హాస్టళ్లను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

నెల్లూరు జిల్లాలో “విద్య… వసతి… వికాసం” ప్రారంభం – ఉదయగిరి హాస్టళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎమ్మెల్యే కాకర్ల సురేష్