శ్రీకాళహస్తి, ఏప్రిల్ 27 (పున్నమి న్యూస్( : తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన భారత ఉపరాష్ట్రపతికి రేణిగుంట విమానాశ్రయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం తరపున, నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జరిగిన మర్యాదపూర్వక భేటీలో శ్రీకాళహస్తి క్షేత్ర మహిమను వివరించి, జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి తీర్థ ప్రసాదాలను అందజేసినట్లు తెలిపారు. స్వామి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఉండాలని ఆకాంక్షించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా గుడిమల్లం ఆలయ చారిత్రక ప్రాముఖ్యతను వివరించే ‘గుడిమల్లం కాఫీ టేబుల్ బుక్’ను బహుకరించినట్లు వెల్లడించారు. ప్రాంత చారిత్రక సంపదను ప్రపంచానికి తెలియజేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే బొజ్జల – శ్రీకాళహస్తి క్షేత్ర వైభవం పరిచయం