Monday, 27 April 2026
  • Home  
  • బీసీల సామాజిక న్యాయం కోసం నిరంతరం శ్రమిస్తా-ఎస్.వి. రమణ
- తిరుపతి

బీసీల సామాజిక న్యాయం కోసం నిరంతరం శ్రమిస్తా-ఎస్.వి. రమణ

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 27 (పున్నమి న్యూస్( : జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షుడిగా శెంజిగరం వెంకటరమణయ్య (ఎస్.వి. రమణ) నియమితులయ్యారు. నెల్లూరు పట్టణంలోని యాదవ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య చేతుల మీదుగా రమణ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.వి. రమణ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించిన ఆర్. కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా బీసీల విద్య, ఉపాధి, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి పోరాడుతానన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆశయ సాధనకు అహర్నిశలు శ్రమిస్తూ, నియోజకవర్గంలో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.