పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 4 చిట్టమూరు మండలం,
✍️మండల పరిధిలోని కోగిలి గ్రామం పంచాయతీలోని స్వచ్ఛరథ వాహనాన్ని సూళ్లూరుపేట డివిజన్ డెవలప్మెంట్ అధికారి చెన్నప్ప రెడ్డి అకస్మిక తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో చిటమూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీవో కాశీ నాయక్, పంచాయతీ కార్యదర్శి మధుసూదన్ రావు పాల్గొన్నారు.
స్వేచ్ఛ రథం వాహనం యొక్క పనితీరు, పారిశుద్ధ్య కార్మికుల హాజరు, గ్రామంలో చెత్త సేకరణ తదితర అంశాలను అధికారులు పరిశీలించారు,
ఈ సందర్భంగా స్వేచ్ఛ రథ నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమంలో అమలు, వ్యర్ధాల సేకరణ,నిర్వహణ విధానాలను పరిశీలించి,సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
గ్రామంలో పరిశుద్ధాన్ని మరింత మెరుపరచడంతో పాటు ప్రజలతో మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ చెన్నప్ప రెడ్డిఅధికారులకు సూచించారు.
ఈ తనిఖీలు చిటమూరు ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీవో కాశీ నాయక్, పంచాయతీ కార్యదర్శి మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.



