Sunday, 19 July 2026
  • Home  
  • నేడే నంద్యాలలో గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల….. న్యాయభేరి సభ
- నంద్యాల

నేడే నంద్యాలలో గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల….. న్యాయభేరి సభ

:జూలై 19 వతేదీ ఆదివారం నంద్యాల జిల్లా కేంద్రంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మరియు రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయభేరి సభకు బహుజన ఉద్యోగులు,న్యాయవాదులు,డాక్టర్లు,చార్టెడ్ అకౌంటెంట్స్,వివిధ వృత్తి నిపుణులు,బహుజనవాదులు పాల్గొని విజయవంతం చేయాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు బిజినవేముల శ్రీనివాసులు పిలుపునిచ్చారు.రాజ్యాంగ పరిరక్షణ కోసం,ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం,కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత కోసం,విద్యా వైద్య రంగాలలో సమాన అవకాశాల కోసం,చట్టసభలలో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని,గ్రేటర్ రాయలసీమ పరిధిలో గిరిజనులకు ఐదు ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాలు కేటాయించాలని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నిధుల కోసం,బహుజనులందరికి జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో వాటా కోసం నిర్వహిస్తున్నటువంటి గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయభేరి సభను అందరూ పాల్గొని విజయవంతం చేయాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పెరుగు శివకృష్ణ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో న్యాయవాది అబ్దుల్ ఖాదర్,రిజర్వేషన్ల పరిరక్షణ సమితి నంద్యాల కార్యదర్శి మనోహర్,జిల్లా ప్రధాన కార్యదర్శి రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.