Monday, 27 April 2026
  • Home  
  • కరాటే బెల్ట్ పరీక్షల్లో శ్రీ చైతన్య విద్యార్థుల విజయం – ఎల్లో బెల్ట్‌ల సాధన
- తిరుపతి

కరాటే బెల్ట్ పరీక్షల్లో శ్రీ చైతన్య విద్యార్థుల విజయం – ఎల్లో బెల్ట్‌ల సాధన

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 27 (పున్నమి న్యూస్( : శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు రేణిగుంటలో ఆదివారం నిర్వహించిన కరాటే బెల్ట్ పరీక్షల్లో ప్రతిభ చాటారు. కరాటే మాస్టర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులు “Okinawan Goju-Ryu Shorei-Kan Karate” అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన బెల్ట్ గ్రేడింగ్‌లో పాల్గొన్నారు. ఈ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థుల్లో 14 మంది ఎల్లో బెల్ట్ సాధించి పాఠశాలకు గౌరవాన్ని తీసుకువచ్చారు. మొత్తం 60 మంది విద్యార్థులు పాల్గొనగా, వారి ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రూపాదేవి మాట్లాడుతూ….కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. సాధించిన విజయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. విజేతలకు డీఎస్పీ శ్రీనివాసరావు చేతుల మీదుగా షీల్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఎజిఎం సురేష్ మాట్లాడుతూ.. ఈ విజయం విద్యార్థుల కృషికి ప్రతిఫలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీన్ త్రివేణి, ఇన్‌చార్జులు కల్పన, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.