Saturday, 16 May 2026
  • Home  
  • మంత్రి ఆనంను మర్యాదపూర్వకంగా కలసిన శ్రీకాళహస్తి దేవస్థాన చైర్మన్
- తిరుపతి

మంత్రి ఆనంను మర్యాదపూర్వకంగా కలసిన శ్రీకాళహస్తి దేవస్థాన చైర్మన్

శ్రీ కాళహస్తి, మే 16 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, పాలకమండలి సభ్యుడు పగడాల మురళి మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలో జరిగిన జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు మంత్రికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శ్రీకాళహస్తి దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ పనులను వేగవంతం చేసి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.