Saturday, 16 May 2026
  • Home  
  • ఒబిసి సంక్షేమం కు సమిష్టి కృషి మస్తాన్ రావు యాదవ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఒబిసి సంక్షేమం కు సమిష్టి కృషి మస్తాన్ రావు యాదవ్

ఒబిసి సంక్షేమం కోసం దేశ వ్యాప్తంగా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఓబీసీ సంక్షేమ కమిటీ సమావేశాల్లో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ పేర్కొన్నారు. పార్లమెంటు ఓబీసీ సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో డెహ్రాడూన్ లో జరిగిన అధ్యయన పర్యటన లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా డెహ్రాడూన్‌లో నిర్వహించిన తొలి రోజు సమావేశాల్లో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఓబీసీలకు ఉద్యోగాలలో ప్రాతినిధ్యం కల్పించడం, సంక్షేమ చర్యలు అమలు చేయడం, పదోన్నతుల్లో అవకాశాలు పెంపు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.సమావేశాల్లో టి హెచ్ డి సి ఇండియా లిమిటెడ్, గెయిల్ ఇండియా లిమిటెడ్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పవన్ హన్స్ లిమిటెడ్ సంస్థల ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో పాటు ఆయా మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీద మస్తాన్ రావు యాదవ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఓబీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఓబీసీల సంక్షేమం, ఉద్యోగ భద్రత, నైపుణ్యాభివృద్ధి, పదోన్నతుల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు..ఓబీసీ వర్గాల అభ్యున్నతికి పార్లమెంటరీ కమిటీలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, ఉద్యోగుల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఒబిసి సంక్షేమం కోసం దేశ వ్యాప్తంగా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని
ఓబీసీ సంక్షేమ కమిటీ సమావేశాల్లో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ పేర్కొన్నారు.
పార్లమెంటు ఓబీసీ సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో డెహ్రాడూన్ లో జరిగిన అధ్యయన పర్యటన లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా డెహ్రాడూన్‌లో నిర్వహించిన తొలి రోజు సమావేశాల్లో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఓబీసీలకు ఉద్యోగాలలో ప్రాతినిధ్యం కల్పించడం, సంక్షేమ చర్యలు అమలు చేయడం, పదోన్నతుల్లో అవకాశాలు పెంపు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.సమావేశాల్లో టి హెచ్ డి సి ఇండియా లిమిటెడ్, గెయిల్ ఇండియా లిమిటెడ్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పవన్ హన్స్ లిమిటెడ్ సంస్థల ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో పాటు ఆయా మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీద మస్తాన్ రావు యాదవ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఓబీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఓబీసీల సంక్షేమం, ఉద్యోగ భద్రత, నైపుణ్యాభివృద్ధి, పదోన్నతుల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు..ఓబీసీ వర్గాల అభ్యున్నతికి పార్లమెంటరీ కమిటీలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, ఉద్యోగుల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.