గూడూరులో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
ముస్తాబాద్ / ఫిబ్రవరి /పున్నమి ప్రతినిధి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అపర భగీరథుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు అయినా కె చంద్రశేఖర రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ తాటాకర్ల ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎదునూరి శ్రీనివాస్, వార్డు సభ్యుడు పుల్లూరి సంతోష్, కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షులు వంగూరి దిలీప్, కేటీఆర్ సేన గూడూరు గ్రామ అధ్యక్షులు చెక్కపెల్లి వెంకటేష్, యువ ఉపాధ్యక్షులు పొందుర్తి పవన్ కళ్యాణ్, బీఆర్ఎస్ యువ ప్రధాన కార్యదర్శి కోడూరి మనీష్, నాయకులు మాధవరం శిరీష్, మెరుగు వెంకటేష్, ఎదునూరి అజయ్, వంగూరి గోపి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ గారి దూరదృష్టి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశకమైందని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.


