నెల్లూరు,డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు నగరంలోని విజయ మహాల్ గేట్ సెంటర్ శ్రీనివాస అగ్రహారంలో గల జిల్లా గౌడ్ యువజన సంఘ కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా రాధాకృష్ణ గౌడ్ గారు సర్దార్ గౌతు లచ్చన్న స్పూర్తితో గౌడ్ కులస్తుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో వెంపులూరు భాస్కర్ గౌడ్, అన్నం దయాకర్ గౌడ్, దాసరి ప్రసాద్ గౌడ్, తిరకాల శివ గౌడ్, దద్దోలు పవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


