రాజన్న సిరిసిల్ల జిల్లా /మే 15 /పున్నమి ప్రతినిధి
పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని BRS పార్టీ రాష్ట్ర నాయకులు మెంగని మనోహర్ డిమాండ్ చేశారు. లీటర్‌కు రూ.3 చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్యులు మరియు మధ్యతరగతి ప్రజలపై ఈ ధరల పెంపు భారీ భారం మోపుతోందన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ప్రజలపై భారాలు మోపడం బీజేపీ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని విమర్శించారు.
గతంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ధరల పెంపు నిర్ణయాలు తీసుకోవడం ప్రజలు గమనిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం భారత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని BRS పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు.

