ఖమ్మం డిసెంబర్
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాల్వంచ, చంద్రుగొండ, జూలూరు పాడు, తల్లాడ మండలాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రజలతో నేరుగా మమేకమై పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో సీత రామ్ నాయక్, దివ్య శ్రీ, చిలుకూరు రమేష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని ప్రజలను కోరారు.


