*ఈ నెల 6న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖ రాక*
*విశాఖపట్నం డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి:- * ఈ నెల 6,7వ తేదీలలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ శ్రీ నజీర్ విశాఖపట్నం లో పర్యటించ నున్నారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 8.00 గంటలకు వాయు మార్గం ద్వారా విశాఖపట్నం చేరుకొని అక్కడ నుండి నోవాటెల్ కు చేరు కుంటారు. మద్యాహ్నం 12.45 గంటలకు నోవాటెల్ నుండి బయలుదేరి మధురవాడ లోని ACA-VDCA క్రికెట్ స్టేడియంకు వెళ్తారు. రాత్రి 10.00 గంటలకు స్టేడియం నుండి నోవాటెల్ హోటల్ కు చేరుకుని రాత్రి బస చేస్తారు. 7వ తేది మధ్యాహ్నం 1.45 గంటలకు ఎయిర్ పోర్ట్ కు చేరుకుని వాయు మార్గం ద్వారా విజయవాడ వెళ్తారు.

