తిరుపతి, ఆగస్టు 03 (పున్నమి ప్రతినిధి)
సన్నబియ్యం ధరలు పెరగడంతో ప్రజలకు ఊరట కల్పించేందుకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తిరుపతి రైతు బజార్లో సబ్సిడీ సన్నబియ్యం విక్రయాలను కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. స్టీమ్ బీపీటీ బియ్యాన్ని kg రూ.52, రా బీపీటీని రూ.50కు అందిస్తున్నారు. జిల్లాలో 28 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో రైన్కార్డుకు నెలకు 26 kgల బ్యాగు అందజేస్తారు. రైతుబజార్లు, మిల్లర్ల విక్రయ కేంద్రాల్లో బియ్యం ఇవ్వనున్నారు.

