కలువాయ మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో అంగన్వాడీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ సుధాకర్, రాజేశ్వరి, రాజ్యలక్ష్మి అంగన్వాడీ సిబ్బందికి పలు అంశాలపై శిక్షణ అందించారు. చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్య, గర్భిణులు, బాలింతలకు అందించాల్సిన సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
Uploaded Video:

