నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడు సమీపంలోని పిల్లాపేరు బ్రిడ్జిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లా పామూరు నుంచి కడప వైపు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి వాగులోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రులను 108 సిబ్బంది ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

దుత్తలూరు మండలం తెడ్డుపాడు పిల్లాపేరు బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడు సమీపంలోని పిల్లాపేరు బ్రిడ్జిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లా పామూరు నుంచి కడప వైపు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రులను 108 సిబ్బంది ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

