Saturday, 14 February 2026
  • Home  
  • హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
- అన్నమయ్య

హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

నాగిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ ప్రధాన శిల్పి బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంత్యుత్సాహాన్ని తలపించేలా ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, పాల్గొని ఆయన చిత్రపటానికి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన విస్డం స్కూల్ అధినేత వలిమి సుధాకర్ మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం కేవలం ఒక జ్ఞాపక దినం మాత్రమే కాకుండా,దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడటానికి ప్రతీ భారతీయుడిగా మనం పాటించాల్సిన సూత్రాలను గుర్తు చేసే సందర్భమని పేర్కొన్నారు.సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి అంబేద్కర్ ప్రవచించిన విలువలు భారత సమాజాన్ని మరింత బలపరుస్తాయని వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతీ వ్యక్తికి హక్కులు మాత్రమే కాకుండా బాధ్యతలను కూడా నిర్దేశించినదని, అవి పాటించినప్పుడే సమాజం శాంతియుతంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు.సామాజిక చైతన్యం పెంపొందేందుకు అంబేద్కర్ సిద్ధాంతాలు నేటికీ మార్గదర్శకాలని ఆయన గుర్తుచేశారు.కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు రాచూరి మురళి, వీరబల్లి జయకుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు పఠాన్ మహర్ ఖాన్, పొంబల నరసింహా పాల్గొని ప్రజాస్వామ్య బలపాటుకు ప్రతి పౌరుడూ రాజ్యాంగ విలువలు అర్థం చేసుకొని వాటిని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న విస్డం స్కూల్ అధినేత వలిమి సుధాకర్ మాట్లాడుతూ, పిల్లలకు చిన్నప్పటినుంచే రాజ్యాంగ సూత్రాలను పరిచయం చేసేలా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.గ్రామంలోని వ్యాపార వర్గం తరఫున దార్ల సురేష్, తదితరులు పాల్గొని అంబేద్కర్ దర్శించిన సమానత్వ తత్వం ఆర్థిక రంగంలోనూ ప్రతి ఫలించాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రతి ఒక్కరు హక్కులు,బాధ్యతల పట్ల అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

నాగిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ ప్రధాన శిల్పి బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంత్యుత్సాహాన్ని తలపించేలా ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, పాల్గొని ఆయన చిత్రపటానికి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.
కార్యక్రమాన్ని ప్రారంభించిన విస్డం స్కూల్ అధినేత వలిమి సుధాకర్ మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం కేవలం ఒక జ్ఞాపక దినం మాత్రమే కాకుండా,దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడటానికి ప్రతీ భారతీయుడిగా మనం పాటించాల్సిన సూత్రాలను గుర్తు చేసే సందర్భమని పేర్కొన్నారు.సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి అంబేద్కర్ ప్రవచించిన విలువలు భారత సమాజాన్ని మరింత బలపరుస్తాయని వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతీ వ్యక్తికి హక్కులు మాత్రమే కాకుండా బాధ్యతలను కూడా నిర్దేశించినదని, అవి పాటించినప్పుడే సమాజం శాంతియుతంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు.సామాజిక చైతన్యం పెంపొందేందుకు అంబేద్కర్ సిద్ధాంతాలు నేటికీ మార్గదర్శకాలని ఆయన గుర్తుచేశారు.కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు రాచూరి మురళి, వీరబల్లి జయకుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు పఠాన్ మహర్ ఖాన్, పొంబల నరసింహా పాల్గొని ప్రజాస్వామ్య బలపాటుకు ప్రతి పౌరుడూ రాజ్యాంగ విలువలు అర్థం చేసుకొని వాటిని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న విస్డం స్కూల్ అధినేత వలిమి సుధాకర్ మాట్లాడుతూ, పిల్లలకు చిన్నప్పటినుంచే రాజ్యాంగ సూత్రాలను పరిచయం చేసేలా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.గ్రామంలోని వ్యాపార వర్గం తరఫున దార్ల సురేష్, తదితరులు పాల్గొని అంబేద్కర్ దర్శించిన సమానత్వ తత్వం ఆర్థిక రంగంలోనూ ప్రతి ఫలించాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రతి ఒక్కరు హక్కులు,బాధ్యతల పట్ల అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.