అంబేద్కర్ నగర్ మరియు బీసీ కాలనీ ప్రాంతాల్లో కొనసాగుతున్న కాలుష్య సమస్యపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ నరుకుల రాజేశ్వరి అప్పారావు ఆధ్వర్యంలో ప్రజలు కలిసి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఇప్పటికే ఎమ్మెల్యే రాగమయి దయానంద సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. సమస్యను పరిశీలనలో ఉంచామని, త్వరలోనే పరిష్కారం కోసం చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. స్పందించిన అధికారులకు, ప్రజల తరఫున సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కాలుష్యంపై గళమెత్తిన ప్రజలు – తక్షణ చర్యలకు డిప్యూటీ సీఎం హామీ