ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 20 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం పిడూరుపాలెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 81, 82, 83, 84లో ఉన్న 150 ఎకరాల సీజేఎఫ్‌ఎస్ భూమిలో అక్రమంగా రొయ్యల సాగు జరుగుతోందని నాలుగు గ్రామాల రైతులు సోమవారం తహసిల్దార్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ తాసిల్దారు స్పందించకపోవడంతో మరోసారి బుధవారం అనేక మందితో తాసిల్దారు వారి కార్యాలయాన్ని ముట్టడించారు. పంట కాలువలు పూడ్చివేయడంతో 600 ఎకరాల సాగు భూమి నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల సాగు వల్ల కాలుష్యం పెరిగి మనుబోలు, పిడూరు, పిడూరుపాలెం, లక్ష్మీనరసింహపురం గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే సాగు నిలిపివేయాలని, హెచ్చరిస్తూ ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించారు.

రొయ్యల సాగుతో రైతులకు ముప్పు.. ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 20 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం పిడూరుపాలెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 81, 82, 83, 84లో ఉన్న 150 ఎకరాల సీజేఎఫ్‌ఎస్ భూమిలో అక్రమంగా రొయ్యల సాగు జరుగుతోందని నాలుగు గ్రామాల రైతులు సోమవారం తహసిల్దార్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ తాసిల్దారు స్పందించకపోవడంతో మరోసారి బుధవారం అనేక మందితో తాసిల్దారు వారి కార్యాలయాన్ని ముట్టడించారు. పంట కాలువలు పూడ్చివేయడంతో 600 ఎకరాల సాగు భూమి నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల సాగు వల్ల కాలుష్యం పెరిగి మనుబోలు, పిడూరు, పిడూరుపాలెం, లక్ష్మీనరసింహపురం గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే సాగు నిలిపివేయాలని, హెచ్చరిస్తూ ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించారు.

