రైల్వేకోడూరు తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని సచివాలయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్సీటీ, తిరుపతి ఆధ్వర్యంలో మహిళలకు మగ్గం వర్క్‌పై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుపతి జిల్లా డీఆర్డీఏ పీడీ శోభన్ బాబు, ఆర్సీటీ డైరెక్టర్ ఎన్. చంద్రశేఖర్, రైల్వేకోడూరు వెలుగు ఏపీఎం వసుంధర శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ మహిళలు శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని సూచించారు. శిక్షణ అనంతరం అర్హులకు రుణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఆర్సీటీ డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రైల్వేకోడూరులో మరిన్ని ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం మహిళలకు మగ్గం వర్క్ టూల్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్సీటీ కోఆర్డినేటర్ సదాశివం, గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ కె. పార్థసారథి, మహిళలు పాల్గొన్నారు.

కోడూరు : మహిళలకు మగ్గం వర్క్ టూల్ కిట్ల పంపిణీ