జగ్గంపేట / కాకినాడ (విజయసారథి): జగ్గంపేట మండలం రామవరం గ్రామ ప్రజలకు తాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు తెలిపారు.
రామవరం సచివాలయం సమీపంలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన నూతన బోరును కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ బోరు ద్వారా సుమారు 500 కుటుంబాలకు నిరంతరంగా తాగునీటి సరఫరా అందించనున్నట్లు తెలిపారు. గతంలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన బోరు మరమ్మతులకు గురికావడంతో దాని స్థానంలో నూతన బోరును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
త్వరలో ఓవర్హెడ్ ట్యాంకు ద్వారా గ్రామంలోని ప్రజలకు తాగునీరు సరఫరా చేయనున్నట్లు అడబాల వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ ట్యాంకును స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు.
ప్రజలు నూతన బోరును సద్వినియోగం చేసుకోవాలని, ఇది గ్రామ ప్రజలందరి ఆస్తిగా భావించి ప్రత్యేక శ్రద్ధతో పరిరక్షించుకోవాలని ఆయన కోరారు. గ్రామంలో నిరంతర తాగునీటి సరఫరా అందేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తొడ్డ శ్రీను, మొగిలి గంగాధర్, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



