Friday, 15 May 2026
  • Home  
  • పోలీసింగ్ పనితీరును ప్రజల నమ్మకం సంతృప్తి అంశాల ఆధారంగా బేరీజు వేయాలి
- రంగారెడ్డి

పోలీసింగ్ పనితీరును ప్రజల నమ్మకం సంతృప్తి అంశాల ఆధారంగా బేరీజు వేయాలి

పున్నమి అక్టోబర్ 22 అబ్దుల్లాపూర్ మెట్టు మండలం: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ దృఢమైన పోలీసింగ్ వ్యవస్థ చట్టాన్ని నిర్భయంగా పక్షపాత వైఖరి లేకుండా న్యాయం వైపు అడుగులు వేస్తూ శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ప్రతి పోలీసు అధికారి క్రమశిక్షణ నిబద్ధత నిజాయితీతో పనిచేయాలని ఎల్.బి.నగర్ జోన్ డిసిపి అనురాధ అన్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాల అమలు కోసం ఆమె హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ను వనస్థలిపురం ఏసిపి కాశిరెడ్డి తో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి. నాగరాజు గౌడ్,పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై విలువైన పలు అంశాలపై వారికి సూచనలు అందించారు. ప్రాథమిక పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, అందులో భాగంగా బీట్ సహారా, కనిపించే పోలీసింగ్, నిఘ, ఇంటెలిజెన్స్ సేకరణ, అత్యవసర స్పందన, నేర నివారణ, నేర గుర్తింపు, ప్రజాశాంతి భద్రత, సమాజంలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని ఆమె సూచించారు. పోలీసింగ్ విజయాన్ని కేవలం నేర గణాంకాలను కులమానంగా తీసుకోకుండా పోలీసులపై ప్రజల్లో నమ్మకం విశ్వాసం సంతృప్తి వీటిని బేరీజు వేసుకోవాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నేరాల నివారణ, దర్యాప్తు పరిపాలన సామర్ధ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పోలీస్ వ్యవస్థపైవారికి నమ్మకాన్ని కలిగించాలన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని, ప్రజల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించి పోలీసుల పనితీరుపై డీసీపీ అనురాధ సంతృప్తిని వ్యక్తం చేశారు.

పున్నమి అక్టోబర్ 22 అబ్దుల్లాపూర్ మెట్టు మండలం: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ దృఢమైన పోలీసింగ్ వ్యవస్థ చట్టాన్ని నిర్భయంగా పక్షపాత వైఖరి లేకుండా న్యాయం వైపు అడుగులు వేస్తూ శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ప్రతి పోలీసు అధికారి క్రమశిక్షణ నిబద్ధత నిజాయితీతో పనిచేయాలని ఎల్.బి.నగర్ జోన్ డిసిపి అనురాధ అన్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాల అమలు కోసం ఆమె హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ను వనస్థలిపురం ఏసిపి కాశిరెడ్డి తో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి. నాగరాజు గౌడ్,పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై విలువైన పలు అంశాలపై వారికి సూచనలు అందించారు. ప్రాథమిక పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, అందులో భాగంగా బీట్ సహారా, కనిపించే పోలీసింగ్, నిఘ, ఇంటెలిజెన్స్ సేకరణ, అత్యవసర స్పందన, నేర నివారణ, నేర గుర్తింపు, ప్రజాశాంతి భద్రత, సమాజంలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని ఆమె సూచించారు. పోలీసింగ్ విజయాన్ని కేవలం నేర గణాంకాలను కులమానంగా తీసుకోకుండా పోలీసులపై ప్రజల్లో నమ్మకం విశ్వాసం సంతృప్తి వీటిని బేరీజు వేసుకోవాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నేరాల నివారణ, దర్యాప్తు పరిపాలన సామర్ధ్యాన్ని మెరుగుపరచాలని
సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పోలీస్ వ్యవస్థపైవారికి నమ్మకాన్ని కలిగించాలన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని, ప్రజల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించి పోలీసుల పనితీరుపై డీసీపీ అనురాధ సంతృప్తిని వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.