Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

సమ్మంగిపాలెం గ్రామంలో త్రాగునీరు, డ్రైనేజీ,వీధి దీపాలు సమస్య తక్షణమే పరిష్కరించాలి*

ఎంపీడీవోకు సమ్మంగి హరీష్ వినతి*

పరవాడ, ఆగస్టు 17: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ పరిధిలోని సమ్మంగిపాలెం గ్రామంలో గత కొన్ని నెలలుగా నెలకొన్న పారిశుధ్య డ్రైనేజీ కాలువలు, వీధి దీపాలు, ముఖ్యంగా తాగునీరు, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం సమ్మంగి హరీష్ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు సమ్మంగిపాలెం గ్రామంలోని గత కొన్ని నెలలుగా డ్రైనేజీ కాలువలో పూడికతీత తొలగించకపోవడంతో కాలువలు సరిగా శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు నిలిచిపోతున్నట్లు పేర్కొన్నారు. దీంతో దోమల బెడద పెరిగి, పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో కాలువలను శుభ్రం చేయడంతో పాటు మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే గ్రామంలోని కొన్ని వీధుల్లో వీధి దీపాలు పనిచేయడం లేదని, మరికొన్ని ప్రాంతాల్లో తగినంత లైటింగ్ సౌకర్యం లేక రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. పనిచేయని వీధి దీపాలను మరమ్మతు చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త దీపాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ముఖ్యం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *