Thursday, 26 March 2026
  • Home  
  • హ్రియానంద ఆశ్రమంలో 45 చండీ శరన్నవరాత్రులు
- కామారెడ్డి

హ్రియానంద ఆశ్రమంలో 45 చండీ శరన్నవరాత్రులు

*పున్నమి ప్రతినిధి కామారెడ్డి- సెప్టెంబర్ 16* *45వ మహా చండీ శరన్నవరాత్రులు విజయ వంతం చేయాలి* =================================== కామారెడ్డి పట్టణంలో గల చండీ పీఠం శ్రీ హ్రియానంద విద్యా భారతి స్వామి ఆశ్రమంలో 45 వ చండీ శరన్నవరాత్రులు ఈనెల 22 పాడ్యమి ఉదయం 8-30 కి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ నిత్య ముక్త హ్రియానంద స్వామి వారి చేతుల మీదుగా చండీ దీక్షలు, పూజలు ప్రారంభం అవుతాయి. ప్రతి నిత్యం పూజాధికాల, అర్చనలు, అభిషేకాలు, చండీ నవావరణార్చనలు, పారాయణాలు, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదాలు, మహాజన భోజన కార్యక్రమాలు ఉ,, 8-30 నుండి 2-00 వరకు మహా ప్రసాదంతో ముగిసి, సాయంత్రం కూడా యధావిధిగా కార్యక్రమాలు, భజనలు, సత్సంగం, తీర్థ ప్రసాద కార్యక్రమాలు జరుగుతాయి. చివరి మూడు రోజులు గణపతి హవనం, గురు పాదుకాహవనం, చండీ హవనంతో యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ విధం మహా చండీ శరన్నవరాత్రులు పది రోజులుగా సాగి మహా మంగళహారతి తో అక్టోబర్ 1 తేదినాడు ముగుస్తాయి. ఇట్టి కార్యక్రమాలను స్వామీజీ శిష్య బృందం అనగా చండీ పరవారంమంతా కలిసి హ్రియాంబిక మాత సూచనలతో కార్యక్రమాలన్ని దిగ్విజయముగా నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కామారెడ్డి భక్తజనులంతా వినియోగించుకోవాలని అమ్మ వారి అనుగ్రహ ఆశీస్సులు పొందాలని తెలిపారు. ఈ చండీ శరన్నవరాత్రులకు వచ్చి భక్తులంతా నలుపు రంగు దుస్తులు లేకుండా రాగలరని స్వామి జీ, కార్య నిర్వాహక పరివారం ఈ సూచన తప్పకుండా పాటించాలని తెలిపారు.

*పున్నమి ప్రతినిధి కామారెడ్డి- సెప్టెంబర్ 16*

*45వ మహా చండీ శరన్నవరాత్రులు విజయ వంతం చేయాలి*
===================================
కామారెడ్డి పట్టణంలో గల చండీ పీఠం శ్రీ హ్రియానంద విద్యా భారతి స్వామి ఆశ్రమంలో 45 వ చండీ శరన్నవరాత్రులు ఈనెల 22 పాడ్యమి ఉదయం 8-30 కి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ నిత్య ముక్త హ్రియానంద స్వామి వారి చేతుల మీదుగా చండీ దీక్షలు, పూజలు ప్రారంభం అవుతాయి.
ప్రతి నిత్యం పూజాధికాల, అర్చనలు, అభిషేకాలు, చండీ నవావరణార్చనలు, పారాయణాలు, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదాలు, మహాజన భోజన కార్యక్రమాలు ఉ,, 8-30 నుండి 2-00 వరకు మహా ప్రసాదంతో
ముగిసి, సాయంత్రం కూడా యధావిధిగా కార్యక్రమాలు, భజనలు, సత్సంగం, తీర్థ ప్రసాద కార్యక్రమాలు జరుగుతాయి.
చివరి మూడు రోజులు గణపతి హవనం, గురు పాదుకాహవనం, చండీ హవనంతో యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ విధం మహా చండీ శరన్నవరాత్రులు పది రోజులుగా సాగి మహా మంగళహారతి తో అక్టోబర్ 1 తేదినాడు ముగుస్తాయి.
ఇట్టి కార్యక్రమాలను స్వామీజీ శిష్య బృందం అనగా చండీ పరవారంమంతా కలిసి హ్రియాంబిక మాత సూచనలతో కార్యక్రమాలన్ని దిగ్విజయముగా నిర్వహించడం జరుగుతుంది.
ఈ అవకాశాన్ని కామారెడ్డి భక్తజనులంతా వినియోగించుకోవాలని అమ్మ వారి అనుగ్రహ ఆశీస్సులు పొందాలని తెలిపారు.

ఈ చండీ శరన్నవరాత్రులకు వచ్చి భక్తులంతా నలుపు రంగు దుస్తులు లేకుండా రాగలరని స్వామి జీ, కార్య నిర్వాహక పరివారం ఈ సూచన తప్పకుండా పాటించాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.