ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ భారం
చివరి విడత బిల్లులు రాక అప్పుల కిందకు నెట్టివేత
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లబ్ధిదారులకు శాపంగా మారింది. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు కూడా చేసినా, చివరి విడత బిల్లులు విడుదల కాకపోవడంతో వేలాది మంది లబ్ధిదారులు వడ్డీ భారంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
*కోట్లల్లో పెండింగ్ బిల్లులు*
ఉమ్మడి ఖమ్మం జిల్లా గణాంకాల ప్రకారం
ఖమ్మం
జిల్లా 16,497 ఇళ్లకు గాను 6,107 ఇళ్ల నిర్మాణం పూర్తయింది.
భద్రాద్రి జిల్లా 17,581 ఇళ్లకు గాను 4,237 ఇళ్ల నిర్మాణం పూర్తయింది.
కానీ పూర్తయిన ఈ ఇళ్లలో చాలా వరకు లబ్ధిదారులకు చివరి విడత నిధులు ఇంకా అందలేదు
*అప్పులు చేసి ఇల్లు కట్టి ఇప్పుడు వడ్డీ కడుతున్నారు*
ప్రభుత్వం నుండి నిధులు ఆలస్యం అవుతుండటంతో లబ్ధిదారులు బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ వారి నుండి వడ్డీకి అప్పులు చేసి ఇళ్లు పూర్తి చేశారు. ఇప్పుడు ఇల్లు ఉన్నా చేతిలో డబ్బు లేక నెలనెలా వడ్డీ కట్టుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు.
గృహప్రవేశం చేసి సంవత్సరం అవుతుంది. కానీ చివరి ఒక లక్ష రూపాయల బిల్లు ఇంకా రాలేదు. అప్పు చేసినందుకు నెలకు 2000 వడ్డీ కడుతున్నా” అని ఒక లబ్ధిదారుడు ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు సకాలంలో విడుదల కాకపోవడమే ఆలస్యానికి కారణమని అధికారులు చెబుతున్నప్పటికీ, ఫైళ్లు పెండింగ్‌లో పెట్టి లబ్ధిదారులను తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పెండింగ్‌లో ఉన్న చివరి విడత బిల్లులను వెంటనే విడుదల చేయాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అప్పుల వడ్డీ భారం తగ్గించేందుకు ప్రభుత్వమే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్లు ప్రజల కలను నెరవేర్చాల్సి ఉండగా, నిధుల జాప్యం వల్ల ఆ కల కాస్త కన్నీరుగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



4 Comments
Naralakonda Srikanth yadav
August 7, 2026మది బాటసింగారం అబ్దుల్లాపూర్ మెట్ రంగారెడ్డి మేము కూడా పూర్తి చేసి 5 నెలలు అవుతుంది ఇంకా 160000రూపాయలు రావాలి చాలా ఇబ్బంది గా ఉంది మేము కూడా నెలకు 5000వడ్డీ కడుతునం పైసలు తొందరగా వచ్చే అవకాశం లేదు అనుకుంటున్నాం
Naralakonda Srikanth yadav
August 7, 2026మది బాటసింగారం అబ్దుల్లాపూర్ మెట్ రంగారెడ్డి మేము కూడా పూర్తి చేసి 5 నెలలు అవుతుంది ఇంకా 160000రూపాయలు రావాలి చాలా ఇబ్బంది గా ఉంది మేము కూడా నెలకు 5000వడ్డీ కడుతునం పైసలు తొందరగా వచ్చేలాగా చూడండి
Ramesh
August 7, 2026Me to very excerbated to phase financial issues regarding indiramma illu final bill….I cordially requesting to government as possible as earliest release the funds
Shaik Waseem
August 7, 2026Nizamabad distics no dabal bedroom 15 years no given government house all ready dabal bedroom is old rady bat govt is fail old and new