బద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలం ఆగస్టు 7, (పున్నమి ప్రతినిధి)
వాడి వేడిగా జరిగిన గూడెం కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశం. ప్రజా సమస్యలపై అధికారులను నిలదీసిన 16 వ డివిజన్ కార్పొరేటర్ పద్మ.
: వాడి వేడిగా జరిగిన గూడెం కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశం. ప్రజా సమస్యలపై అధికారులను నిలదీసిన 16 వ డివిజన్ కార్పొరేటర్ పద్మ. ఎజెండాలోని 30 అంశాలపై వాడి వేడి చర్చ. ఎజెండాపై చర్చను వాయిదా వేయాలని స్వ పక్షంలోని విపక్ష కాంగ్రెస్.ఎజెండాను వాయిదా వేయడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు, మీకు నచ్చని అంశాలుంటే వాటిపై ఎన్నిక పెట్టండి.అన్నిటిపై ఎన్నిక పెట్టాలంటే ప్రతి నెల జరిగే ఎజెండాలోని అన్ని అంశాలపై ఎన్నిక పెట్టాల్సి ఉంటుందని కాంగ్రెస్ ప్రతివాదులను ప్రశ్నించిన 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ.ఆమె మాటకు అడ్డుపడిన కాంగ్రెస్ కార్పొరేటర్లకు, సిపిఐ కార్పొరేటర్లకు వాగ్వివాదం. శానిటేషన్ అస్తవ్యస్తానికి శానిటేషన్ ఎస్సై పోస్టును భర్తీ చేయకపోవడమే కారణం. శానిటేషన్ ఎస్సై పోస్టును ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని పట్టు పట్టిన కార్పొరేటర్ మునిగడప పద్మ. 16వ డివిజన్లోని పాత సింగరేణి సూపర్ మార్కెట్ ఏరియాలో నూతన భవన నిర్మాణం కీ నిధులు కేటాయించాలని కౌన్సిల్లో ప్రస్తావించిన మునిగడప పద్మ.రామవరం రోడ్లపై ప్రమాదాలకు కారణమవుతున్న ఆవులను బందెల (గోశాల ) దొడ్డికి తరలించడంలో మున్సిపల్ అధికారులు విఫలమవుతున్నారని, తక్షణమే వాటి గోశాలలో పెట్టాలని అలాగే డివిజన్లోని రిపేర్ లో ఉన్న బోర్ను బాగు చేయాలని అధికారులను కోరిన మునిగడప పద్మ.ఎజెండాలోని పదో అంశంపై కార్పొరేటర్ పద్మ మాట్లాడుతూ రామవరం యు పి ఎచ్ లో ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలని కమీషనర్ ను కోరడం జరిగింది. మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో 30 అంశాలపై చర్చ జరిగి 18వ అంశం మినహాయించి 29 అంశాలను ఆమోదించడం జరిగింది.మూడ్ గణేష్ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డి ఈ నరేష్ రెడ్డి, మరియు అధికారులు, సిపిఐ, కాంగ్రెస్, టిఆర్ఎస్, సీపీఎం, బిజెపి, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు పాల్గొన్నారు


