రేపటి రాష్ట్ర వ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపు
మంథని, జులై 22, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జూలై 23న నిర్వహించే రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయడానికి విద్యార్థి లోకమంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ, డీఈవో పోస్టులను భర్తీ చేయాలని,బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని,అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలి.ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని, విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని, ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ లతో ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యా రంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు బందెల రాజకుమార్, నాయకులు రజినీకాంత్, గణేష్, రోహిత్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు..


