Sunday, 31 May 2026
  • Home  
  • 62 ఏళ్ల కాపురానికి ఇప్పుడు డైవర్స్ ఏంటి..? విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు వైరల్!
- News

62 ఏళ్ల కాపురానికి ఇప్పుడు డైవర్స్ ఏంటి..? విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు వైరల్!

విశాఖ ఎయిర్‌పోర్ట్ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గూగుల్, టీసీఎస్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్న విశాఖ నగరానికి ఎయిర్‌పోర్ట్ లేకపోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను పక్కనపెట్టి కేవలం బోగాపురం ఎయిర్‌పోర్ట్‌పైనే ఆధారపడతామనడం సరైన నిర్ణయం కాదన్నారు. “62 ఏళ్లుగా కలిసి కాపురం చేసిన భార్యాభర్తలు ఇప్పుడు విడాకులు తీసుకుంటామంటే ఎలా ఉంటుందో.. విశాఖకు ఉన్న ఎయిర్‌పోర్ట్‌ను తీసేసి బోగాపురం మాత్రమే ఉంటుందని చెప్పడం కూడా అలాంటిదే” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ నగర అభివృద్ధి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. Uploaded Video:

విశాఖ ఎయిర్‌పోర్ట్ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గూగుల్, టీసీఎస్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్న విశాఖ నగరానికి ఎయిర్‌పోర్ట్ లేకపోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను పక్కనపెట్టి కేవలం బోగాపురం ఎయిర్‌పోర్ట్‌పైనే ఆధారపడతామనడం సరైన నిర్ణయం కాదన్నారు.
“62 ఏళ్లుగా కలిసి కాపురం చేసిన భార్యాభర్తలు ఇప్పుడు విడాకులు తీసుకుంటామంటే ఎలా ఉంటుందో.. విశాఖకు ఉన్న ఎయిర్‌పోర్ట్‌ను తీసేసి బోగాపురం మాత్రమే ఉంటుందని చెప్పడం కూడా అలాంటిదే” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ నగర అభివృద్ధి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.