ఖమ్మం జూన్
(పున్నమి జిల్లా ప్రతి నిధి
పువ్వాడ నాగేంద్ర కుమార్ )
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 12 సంవత్సరాలుగా దేశానికి నాయకత్వం వహిస్తూ, ప్రజా సంక్షేమం, జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ధి, సుశాసనం మరియు అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్ఠను పెంపొందించడంలో విశేష కృషి చేస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా నిలిచిందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ సాంకేతికత విస్తరణ, రక్షణ రంగ బలోపేతం, విదేశాంగ విధానంలో దృఢమైన నిర్ణయాలు, పేదలు మరియు బలహీన వర్గాల సంక్షేమానికి అమలు చేసిన పథకాలు దేశ పురోగతికి బలమైన పునాదులుగా నిలిచాయని తెలిపారు.
గత 12 సంవత్సరాల కాలంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించిందని, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడిందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం (వికసిత్ భారత్) లక్ష్య సాధనలో ప్రధాని మోదీ దూరదృష్టి నాయకత్వం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.
అలాగే, దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రపంచ వేదికపై భారతదేశం అత్యున్నత స్థానాన్ని అధిరోహించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు, శక్తి సామర్థ్యాలు కలగాలని శ్రీ సీతారాముల వారిని ప్రార్థిస్తున్నట్లు గల్లా సత్యనారాయణ తెలిపారు.
దేశ ప్రజలందరూ సుఖశాంతులతో, సుభిక్షంగా జీవించాలని, అన్ని రంగాల్లో భారతదేశం మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షిస్తూ, వికసిత్ భారత్ నిర్మాణానికి ముక్కోటి దేవుళ్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన అన్నారు.



