అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో అర్హులైన గిరిజనులకు పింఛన్లు, నూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం మండల అధ్యక్షుడు ఎం.ఎం. శ్రీను, కార్యదర్శి నరసయ్య తదితరులు ఎంపీడీఓ కే. ధర్మారావును కలిసి వినతిపత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కొత్త కార్డులు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు మంజూరు చేయకపోవడంపై వారు మండిపడ్డారు. ఎన్నికల హామీలను విస్మరిస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో గిరిజనులు టీడీపి, జనసేన, బీజేపీ కూటమికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అర్హులైన వారికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

అర్హులైన గిరిజనులకు పింఛన్లు, రేషన్ కార్డులివ్వాలి